రెండు తెలుగు రాష్ట్రాలలో పీపుల్స్ మోటివేషన్ తెలుగు దినపత్రికలో పనిచేయుటకు మండలాల వారీగా రిపోర్టర్లు, నియోజకవర్గ ఇంచార్జీలు, జిల్లా స్టాపర్లు కావలెను...✍️సంప్రదించండి: 80086 22746

-Advertisement-

పేద ప్రజల ఆకలి తీర్చేందుకు మోదీ క్యాంటీన్

Anna canteen news, Modi canteen news, Amma canteen news,
Peoples Motivation


పేద ప్రజల ఆకలి తీర్చేందుకు మోదీ క్యాంటీన్

నంద్యాల ప్రభుత్వ ఆసుపత్రి సమీపంలో మోదీ క్యాంటీన్ ఏర్పాటుకు అనుమతి ఇవ్వాలని జిల్లా కలెక్టర్ శ్రీనివాసులు కు నంద్యాల బిజెపి అసెంబ్లీ కన్వీనర్ అభిరుచి మధు వినతిపత్రం అందించారు. కలెక్టర్ కార్యాలయంలో కలెక్టర్ శ్రీనివాసులు కు ప్రభుత్వ ఆసుపత్రి ఆవరణలో వున్న అన్నా క్యాంటీన్లో పేదలకు ఉచిత భోజనం అందించేందుకు అనుమతి ఇవ్వాలని కోరారు.


ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఆసుపత్రికి వచ్చే రోగులు, బందువులు ఎన్నో ఇబ్బందులు పడుతున్నారని అన్నారు. పేదవారు అధికంగా వస్తుండడంతో వైద్యం ఖర్చులతో పాటు భోజన ఖర్చులు తడిసి మోపడవుతున్నాయని అన్నారు. అభిరుచి సేవా సమితి ద్వారా ఉచితంగా బోజన వసతి కల్పించాలని నిచ్చాయించుకున్నానని అన్నారు. ప్రస్తుతం ప్రభుత్వ ఆసుపత్రి సమీపంలో అన్నా క్యాంటీన్ నిరుపయోగంగా వుండడంతో అక్కడ మోదీ క్యాంటీన్ కు అనుమతి ఇస్తే సొంత ఖర్చులు పెట్టుకుంటాను అన్నారు. అన్నా క్యాంటీన్ లో ఏర్పాటు చేసుకోవడానికి అనుమతి కోసం కలెక్టర్ దృష్టికి తీసుకొని పోయానని అన్నారు. ఆసుపత్రి అధికారితో మాట్లాడుతానని కలెక్టర్ చెప్పారని పేద ప్రజల ఆకలి తెరిస్తే జీవితంలో అంతా కంటే ఆనందం ఏమి లేదన్నారు. డబ్బు ఎంత సంపాదించినా సేవలో వచ్చే ఆనందం మరువలేనిది అన్నారు. అధికారులు ఏర్పాటుకు అవకాశం ఇస్తే త్వరలో పేదలకు నాణ్యమైన భోజనం ఉచితంగా అందిస్తానని నా సంకల్పానికి అందరూ ఆశీర్వదించండి సేవకు అడ్డుపడవద్దని కోరారు.

Comments

-Advertisement-