కొత్త నాయకుడి కోసం ఎదురుస్తున్న మైదుకూరు నియోజకవర్గ ప్రజలు
కొత్త నాయకుడి కోసం ఎదురు చూస్తున్న మైదుకూరు నియోజకవర్గ ప్రజలు
మైదుకూరు నియోజకవర్గంలో పుంజుకుంటున్న జనసేన పార్టీ
గ్రామ స్థాయిలో పార్టీని బలపరుస్తున్న పాశం లక్ష్మి నరసయ్య
కొత్త నాయకుడి కోసం ఎదురు చూస్తున్న మైదుకూరు నియోజకవర్గ ప్రజలు
మా నాయకుడు పాశం లక్ష్మి నరసయ్య నేనని ప్రకటించిన జన సైనికులు
అధికార పార్టీ అరాచకాలతో విసుగెత్తిన ప్రజలు
పాశం లక్ష్మి నరసయ్య సేవా కార్యక్రమాలకు ఆకర్షితులైన ప్రజలు
మైదుకూరు అసెంబ్లీ అభ్యర్థిగా పాశం కు అవకాశం అందుబాటులో ప్రజల వాదన..
మంచి నాయకుడిగా రాణిస్తున్న- పాశం
కడప/మైదుకూరు, ఫిబ్రవరి 10 పీపుల్ మోటివేషన్ న్యూస్:-
ఎక్కడ చూసిన అధికార పార్టీ వైసిపికి ఎదురు గాలి వీస్తోంది... అధికార పార్టీ కి చరమ గీతం పాడేందుకు ప్రజలు సిద్ధమయ్యారు. ఇందులో భాగంగానే..... మైదుకూరు నియోజకవర్గంలో అధికార పార్టీ ఎమ్మెల్యే శెట్టి పల్లె రఘురామి రెడ్డి ప్రజల్లో విశ్వాసం కోల్పోయారు. ప్రజలకు అందుబాటులో లేకపోవడం, ప్రజా సమస్యలు గాలికి వదిలేయడం తో ప్రజలు వచ్చే ఎన్నికల్లో ఓటుతో బుద్ధి చెప్పేందుకు సిద్ధమయ్యారు...
ప్రజల చూపు పాశం వైపే...
మైదుకూరు నియోజకవర్గంలో రోజుకు జన సేన పార్టీ పుంజుకుంటుంది. గ్రామ స్థాయిలో పార్టీని ప్రముఖ రియల్ ఎస్టేటర్, వ్యాపారస్తుడు, సేవాభావి అయిన పాశం లక్ష్మీ నరసయ్య బలపరుస్తున్నారు. కొత్త నాయకుడి కోసం ఎదురు చూస్తున్న మైదుకూరు నియోజకవర్గ ప్రజల చూపు పాశం లక్ష్మి నరసయ్య పై పడింది. ఆయననే తమ నాయకుడు అని ప్రజలు సమర్థించారు. ఇప్పటికే మా నాయకుడు పాశం లక్ష్మి నరసయ్యేనని జన సైనికులు ఎదురుచూస్తున్నారు._
పాశం లక్ష్మి నరసయ్య రాజకీయ నేపథ్యం
పాశం లక్ష్మి నరసయ్య దువ్వూరు లో నే పుట్టి పెరిగారు. ఆయన తల్లిదండ్రులు పెద్ద నరసింహులు, రామ లక్ష్మమ్మ. పాశం లక్ష్మి నరసయ్య కు భార్య హైమావతి, కుమార్తె శ్రీ లక్ష్మి, కుమారుడు కృష్ణ సాయి ఉన్నారు. గతంలో రాజకీయాల్లో చురుగ్గా ఉంటుంది. క్రియశీలకంగా అభ్యర్థుల గెలుపు కోసం కృషి చేశారు. జనసేన పార్టీలో ఇటీవలే చేరి క్రియశీలక నేతగా రాణిస్తున్నారు. పాశం రాకతో వందల కుటుంబాలు జనసేన లో చేరాయి. ప్రతి గ్రామంలో జన సేన పార్టీ జెండా ఎగిరెల, పార్టీ సానుభూతి పరులు ఉండేలా పాశం చర్యలు తీసుకుంటున్నారు.
జన సేన పార్టీ అధిష్టానం దృష్టిలో పాశం పేరు...
బలిజ నేతగా రాణిస్తున్న పాశం
మైదుకూరు నియోజకవర్గంలో జన సేన పార్టీ నుండి బలమైన అసెంబ్లీ అభ్యర్థి ని నిలబెట్టాలని పార్టీ అధిష్టానం చూస్తోంది. మైదుకూరు నియోజకవర్గంలో 40 శాతం పైగా బలిజ, కాపు లు ఉన్నారు. ఆ వర్గం నుంచి బలమైన నేతను నిలబెడితే విజయం ఖాయమని పార్టీ అధిష్ఠానం భావిస్తోంది...
సౌమ్యుడిగా, సేవా తాత్పర్యుడిగా, వ్యాపారవేత్తగా పేరు గాంచిన, బలిజ సంఘం నేత అయిన పాశం లక్ష్మి నరసయ్య ను మైదుకూరు అసెంబ్లీ బరిలో నిలిపేందుకు పార్టీ పెద్దలు యోచిస్తున్నట్లు తెలిసింది. త్వరలోనే అభ్యర్థుల పేర్లను పార్టీ అధిష్టానం ప్రకటించనుంది.
సేవా కార్యక్రమాల్లో ముందున్న పాశం
సేవా కార్యక్రమాల్లో పాశం లక్ష్మి నరసయ్య ఎల్లప్పుడూ ముందుంటున్నారు. గొంతు విజృభించిన సమయంలో పాశం 70 బస్తాలు, వంట సరుకును తన సొంత ఖర్చులు భరించి ప్రజలకు బియ్యం అందించాడు. ఉచిత వైద్య శిబిరాలను ఏర్పాటు చేసి ప్రజలకు ఉచితంగా వైద్య సేవలు అందించారు. అలాగే కాళీకమాత ఆలయ అభివృద్ధికి రూ. 2.70 లక్షలు విరాళంగా అందించారు. అలాగే దువ్వూరు లో రామాలయం కు నాలుగు సెంట్ల ఉచిత అందించారు. పేద పిల్లలకు ప్లేట్లు. ప్రజలకు ఎల్లప్పుడూ అందుబాటులో ఉంటూ పాశం లక్ష్మి నరసయ్య మరెన్నో సేవలు అందిస్తున్నారు.
మైదుకూరు నియోజకవర్గంలో పాశం పేరు ప్రజలకు నోటెడ్.....
పాశం లక్ష్మి నరసయ్య పేరు మైదుకూరు నియోజకవర్గంలో పాశం పేరు అందరికీ తెలుసు. నియోజకవర్గంలోని ప్రతి మండలంలో పాశంకు మంచి బంధుత్వం, పరిచయాలు ఉన్నాయి. మృదు స్వభావి, సేవా తాత్పర్యుడిగా పాశం లక్ష్మి నరసయ్యకు పేరుంది. ప్రజలు, జన సైనికులు ఆయన అడుగు జాడల్లో ముందుకెళ్తున్నారు.
పాశం వ్యాపారాలు....
పాశం లక్ష్మి నరసయ్య కు వ్యాపారాలు చాలానే ఉన్నాయి. పాశం బిల్డర్స్ డెవలపర్స్, రియల్ ఎస్టేట్ బిజినెస్ లు చాలానే ఉన్నాయి. ప్రొద్దుటూరు, దువ్వూరులో పాశం వ్యాపారాలు ఎక్కువగా ఉన్నాయి. ఆయనకు వ్యాపారాల్లో వచ్చే లాభం 10 శాతం డబ్బును సేవా కార్యక్రమాలకు వినియోగిస్తున్నారు.