రెండు తెలుగు రాష్ట్రాలలో పీపుల్స్ మోటివేషన్ తెలుగు దినపత్రికలో పనిచేయుటకు మండలాల వారీగా రిపోర్టర్లు, నియోజకవర్గ ఇంచార్జీలు, జిల్లా స్టాపర్లు కావలెను...✍️సంప్రదించండి: 80086 22746

-Advertisement-

శభాష్..రమేష్, నాగాంజనేయులు, బాబా ఫక్రుద్దీన్, పెద్దిరాజు...'వీక్లీ బెస్ట్ పెర్ఫార్మన్స్

Police news, ap ts police news,
Peoples Motivation

శభాష్..రమేష్, నాగాంజనేయులు, బాబా ఫక్రుద్దీన్, పెద్దిరాజు...

అత్యుత్తమ పనితీరు కనబరచిన సిబ్బందికి "వీక్లీ బెస్ట్ పెర్ఫార్మన్స్ అవార్డు" అందచేసిన జిల్లా ఎస్.పి సిద్దార్థ్ కౌశల్ ఐ.పి.ఎస్

 పోలీస్ సిబ్బందిని ప్రోత్సహించే క్రమంలో జిల్లా ఎస్.పి సిద్దార్థ్ కౌశల్ ఐ.పి.ఎస్ అత్యుత్తమ పనితీరు కనబరచిన వారికి 'వీక్లీ బెస్ట్ పెర్ఫార్మన్స్ అవార్డు' ను అందచేస్తున్నారు. ఈ నేపథ్యంలో శుక్రవారం ముగ్గురు సివిల్, ఒక ఏ.ఆర్ సిబ్బందిని ఎంపిక చేసి నగదు రివార్డు, ప్రశంసా పత్రం అందచేసి ప్రత్యేకంగా అభినందించారు.

మైదుకూరు పోలీస్ స్టేషన్ లో కానిస్టేబుల్ గా విధులు నిర్వహిస్తున్న వై.రమేష్ బాబు ఓ వ్యక్తి ఎలాంటి ఆధారాలు లేకుండా తరలిస్తున్న రూ.31.5 లక్షల నగదును వాహన తనిఖీల్లో స్వాధీన చేసుకోవడంలో కీలక పాత్ర పోషించారు. రమేష్ బాబును జిల్లా ఎస్.పి ప్రత్యేకంగా అభినందించి ప్రశంసా పత్రం, నగదు రివార్డు అందచేశారు. అంకితభావంతో విధులు నిర్వర్తించి స్ఫూర్తిదాయకంగా నిలిచారన్నారు.


ఇటీవల ప్రొద్దుటూరులో భారీగా గోవా నుండి అక్రమంగా తరలిస్తున్న మద్యాన్ని స్వాధీనం చేసుకోవడంలో కీలక పాత్ర పోషించిన రాజుపాలెం పి.ఎస్ హెడ్ కానిస్టేబుల్ కె.నాగాంజనేయులు(హెచ్.సి213) , ప్రొద్దుటూరు వన్ టౌన్ పి.ఎస్ హెడ్ కానిస్టేబుల్ డి.బాబా ఫక్రుద్దీన్ ( హెచ్.సి2146) లను జిల్లా ఎస్.పి గారు ప్రత్యేకంగా అభినందించారు. ప్రశంసా పత్రం, నగదు రివార్డు అందచేశారు.


డి.సి.ఆర్.బి లో సమర్ధవంతంగా విధులు నిర్వహిస్తున్న ఏ.ఆర్ కానిస్టేబుల్ బి.ఎన్ పెద్దిరాజు ( ఏ.ఆర్.పి.సి 420 ) ను జిల్లా ఎస్.పి శ్రీ సిద్దార్థ్ కౌశల్ ఐ.పి.ఎస్ గారు ప్రత్యేకంగా అభినందించారు. నాన్ బెయిలబుల్ వారెంట్లు, లోక్ అదాలత్, ఎలక్షన్ సెల్ విభాగంలోని విధుల్లో అత్యుత్తమ పనితీరు కనబరచడం అభినందనీయమన్నారు.

'వీక్లీ బెస్ట్ పెర్ఫార్మన్స్ అవార్డు' అందుకున్న సిబ్బంది మున్ముందు ఇదే స్పూర్తితో విధులు నిర్వహించాలని జిల్లా ఎస్.పి ఆకాంక్షించారు.


Comments
Comment Poster
Spr

-Advertisement-