పత్రికా స్వేచ్ఛ, పత్రికా విలువలను కాపాడే దిశగా ప్రభుత్వం అడుగులు వేయాలి...
పత్రికా స్వేచ్ఛ, పత్రికా విలువలను కాపాడే దిశగా ప్రభుత్వం అడుగులు వేయాలి...
మీడియా సంస్థలు పత్రిక విలేఖరులపై దాడులు చేసే వారిని కఠినంగా శిక్షించాలి
జర్నలిస్టుల భద్రతకు నూతన చట్టాలు తేవాలి
-ప్రొద్దుటూరు ప్రెస్ క్లబ్
![]() |
వైయస్సార్ కడప జిల్లా, ప్రొద్దుటూరు, ఫిబ్రవరి 21 (పీపుల్స్ మోటివేషన్):-
మంగళవారం సాయంత్రం కర్నూలు నగర నడిబొడ్డున రాజ్ విహార్ సెంటర్లోని ఈనాడు కార్యాలయం పై రాళ్ల దాడి చేసిన వారిని గుర్తించి వెంటనే అరెస్టు చేయాలని డిమాండ్ చేస్తూ కడప జిల్లా ప్రొద్దుటూరు ప్రెస్ క్లబ్ ఆధ్వర్యంలో బుధవారం ఉదయం తాహాసిల్దార్ కార్యాలయం వద్ద నిరసన తెలిపి, అనంతరం డిప్యూటీ తాహాసిల్దార్ మనోహర్ రెడ్డికి వినతిపత్రం సమర్పించారు. ఈ సందర్భంగా పలువురు పాత్రికేయులు మాట్లాడుతూ, గడచిన రెండు రోజుల క్రితం అనంతపురం సిద్ధం సభలో ఏబీఎన్ ఆంధ్రజ్యోతి ఫోటో జర్నలిస్ట్ కృష్ణ పై జరిగిన భౌతిక దాడిని మరువక ముందే, నిన్న కర్నూలు ఈనాడు కార్యాలయం పై వైసీపీ కార్యకర్తల మూకుమ్మడి రాళ్ల దాడిని తాము తీవ్రంగా ఖండిస్తున్నామని, ఈ చర్యలకు పాల్పడిన వారిని తక్షణమే అరెస్టు చేయాలని, ఇప్పటికైనా ప్రభుత్వం పత్రికా స్వేచ్ఛను పత్రికా విలువలను కాపాడే దిశగా అడుగులు వేయాలని ఇలాంటి భౌతిక దాడులు హేయమైన చర్యగా వారు పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో ప్రొద్దుటూరు ప్రెస్ క్లబ్ సభ్యులు పాల్గొన్నారు.
![]() |
డిప్యూటీ తాహాసిల్దార్ మనోహర్ రెడ్డికి వినతిపత్రం సమర్పించిన ప్రెస్ క్లబ్ సభ్యులు |