జిల్లాలో పోలీసుల విస్తృత తనిఖీలు
జిల్లాలో పోలీసుల విస్తృత తనిఖీలు
శ్రీ సత్య సాయి జిల్లా (పీపుల్స్ మోటివేషన్):-
శ్రీ సత్య సాయి జిల్లా ఎస్పీ ఎస్వీ మాధవ్ రెడ్డి ఆదేశాల మేరకు పోలీసులు జిల్లా వ్యాప్తంగా ఈరోజు (ఫిబ్రవరి 11) సాయంత్రం వాహనాల తనిఖీలు నిర్వహించారు. అదేవిధంగా గ్రామాలలో ప్రజలకు రాబోయే ఎన్నికలపై ఎలా ఉండాలి అన్న విషయాలపై అవగాహన కార్యక్రమాలు నిర్వహించారు.
సిఐ లు, ఎస్సైల ఆధ్వర్యంలో పోలీసులు రౌడీషీటర్లను పాత నేరస్తులను మరియు నాటు సారా, కర్నాటక మద్యం, గుట్కా నియంత్రణ కోసం అనుమానితుల, పాత కేసుల్లోని నిందితుల నివాస ప్రాంతాలలో క్షుణ్ణంగా తనిఖీలు నిర్వహించారు.
అనుమానితుల వివరాలను లోతుగా అధ్యయనం చేసి గ్రామసభలు నిర్వహించి ప్రశాంతంగా జీవించాలని సూచనలు చేశారు. ఎలాంటి అల్లర్లకు వెళ్లకూడదని కోరారు.
సాయంత్రం... జిల్లా వ్యాప్తంగా వాహనాల తనిఖీలు చేపట్టి రోడ్డు భద్రతా నిబంధనల ఉల్లంఘనదారులపై చర్యలు తీసుకున్నారు. ఎలాంటి అక్రమ రవాణా జరుగకుండా క్షుణ్ణంగా తనిఖీలు చేపట్టారు.