ప్రపంచ క్యాన్సర్ దినోత్సవం అవగాహన సదస్సు
ప్రపంచ క్యాన్సర్ దినోత్సవం అవగాహన సదస్సు
నంద్యాల, ఫిబ్రవరి 03 (పీపుల్స్ మోటివేషన్):-
స్థానిక శ్రీ రామకృష్ణ డిగ్రీ కళాశాల కళాశాలను నందు శనివారం నాడు ప్రపంచ క్యాన్సర్ దినోత్సవం జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిధులుగా డాక్టర్ సీ.సుస్మిత రెడ్డి ఎంబీబీఎస్., ఎండీ., రేడియోలజీ ఆర్నోకాలోగిస్ట్ మరియు డాక్టర్., సురేఖ రేడియో ఆర్నాకాలోగిస్ట్., కళాశాల చైర్మన్ ప్రొఫెసర్ జి.రామక్రిష్ణ రెడ్డి, కళాశాల డైరెక్టర్ జి.హేమంత్ రెడ్డి, కళాశాల ఎస్టేట్ మేనేజర్ ఎ.ఎస్.ప్రగతి రెడ్డి, మరియు ఉపాధ్యాయుని - ఉపాధ్యాయులు మరియు విద్యార్థులు పాల్గొన్నారు.
కళాశాల చైర్మన్ ప్రొఫెసర్ జి.రామక్రిష్ణ రెడ్డి మాట్లాడుతూ... క్యాన్సర్ గురించి అవగాహన పెంపొందించడానికి దాని నివారణ గుర్తింపును, చికిత్సను ప్రోత్సహించేందుకు 2008లో వ్రాసిన వరల్డ్ క్యాన్సర్ డిక్లరేషన్ లక్ష్యాలకు మద్దతుగా ఉంది. 2020 నాటికి క్యాన్సర్ వల్ల అనారోగ్యం, మరణాలు గణనీయంగా తగ్గించటమే దీని లక్ష్యం అని ప్రజల్లో అవగాహన పెంచడం తద్వారా క్యాన్సర్ కళంకం తగ్గించడం. క్యాన్సర్ తో బాధపడుతున్నవారికి మద్దతు ఇవ్వడానికి అని చెప్పారు.
కళాశాల ఎస్టేట్ మేనేజర్ ఎ.ఎస్.ప్రగతి రెడ్డి మాట్లాడుతూ... భారతదేశంలో క్యాన్సర్ సంక్రమణ అభివృద్ధి చెందిన దేశాల కంటే చాలా తక్కువగా ఉంది. అయినప్పటికీ అనేక కారణాల వల్ల ఆలస్యంగా గుర్తించడం వలన మరణాల రేటు ఎక్కువగా ఉందని ప్రాణాలను రక్షించడానికి ఈ ప్రాణాంతక వ్యాధి గురించి అవగాహన పెంచడం అలాగే వ్యాప్తి నివారణ చేయడం చాలా అవశ్యకమని తెలిపారు.
ముఖ్య అతిథిగా విచ్చేసిన డాక్టర్. సి.సుష్మిత రెడ్డి మాట్లాడుతూ...క్యాన్సర్ అనేది ప్రాణాంతక వ్యాధులలో ఒకటి అని ఒక్కసారి క్యాన్సర్ వస్తే అనారోగ్యంతో నిరంతరం పోరాడాల్సి వస్తుంది అని ఈ వ్యాధితో రోగికి మాత్రమే కాకుండా కుటుంబ సభ్యులకు కూడా జీవితకాలం ధైర్యం మరియు మరియు త్యాగం అవసరం అవుతాయి అని. ముందుగా గుర్తిస్తే క్యాన్సర్ నుంచి బయటపడొచ్చు అని తెలిపారు. ఆధునిక కాలంలో టెక్నాలజీ అభివృద్ధితో క్యాన్సర్ చికిత్సలు మరింత ప్రభావంతంగా ఉన్నప్పటికీ మన దేశంలో చాలా మంది ఇప్పటికీ చికిత్స లేకపోవడంతో మరణిస్తున్నారు. భారతదేశంలో క్యాన్సర్ అవగాహనను కల్పించాలి అని చెప్పారు.
ముఖ్య అతిథులలో ఒకరైన డాక్టర్. సురేఖ మాట్లాడుతూ... క్యాన్సర్ అంటే ఏమిటీ?
క్యాన్సర్ ఎందుకు వస్తుంది?
ఏయే క్యాన్సర్లు ఎలా ఏర్పడతాయి?
క్యాన్సర్ లక్షణాలు ఏమిటీ?
ప్రపంచ క్యాన్సర్ దినం నేపథ్యంలో ఈ వివరాలను తెలుసుకోవడమే కాదు ఇతరులకు కూడా అవగాహన కల్పించండి. కీమోథెరపీ అనేది క్యాన్సర్ కు చికిత్స ఇది క్యాన్సర్ కణాలను చంపడానికి మందులను ఉపయోగిస్తుంది. అనే విషయాలపై అవగాహన కల్పించారు. ఇది దైహిక చికిత్స, అంటే మందులు రక్తప్రవాహం ద్వారా శరీరం అంతటా ప్రయాణించి క్యాన్సర్ కణాలను చేరుకుంటాయి అని చెప్పారు.
కార్యక్రమానికి విచ్చేసినటి వంటి అతితులను ఉపాధ్యాయుని - ఉపాధ్యాయులతో సన్మానించడం జరిగింది. చివరిగా ఈ కార్యక్రమం జాతీయ గేయ ఆలపనతో ముగిసింది.