కోచింగ్ సెంటర్లకు కొత్త రూల్స్...మార్గదర్శకాలు జారీ
కోచింగ్ సెంటర్లకు కొత్త రూల్స్... మార్గదర్శకాలు జారీ
పీపుల్స్ మోటివేషన్ డెస్క్:-
కేంద్ర వినియోగదారుల వ్యవహారాల మంత్రిత్వ శాఖకు చెందిన సెంట్రల్ కన్జ్యూమర్ ప్రొటెక్షన్ అథారిటీ(CCPA) కోచింగ్ సెంటర్లలో తప్పుదోవ పట్టించే ప్రకటనల నివారణ కోసం ముసాయిదా మార్గదర్శకాలను విడుదల చేసింది.
విద్యార్థులను ఆకర్షించడానికి కోచింగ్ సెంటర్లు ఇస్తున్న మోస పూరిత ప్రకటనలతో విద్యార్థులు వారి తల్లిదండ్రులను తప్పుదోవ పట్టించేలా ఉన్నాయని వాటికి అడ్డుకోవడానికి కేంద్ర ప్రభుత్వం సెంట్రల్ కన్జ్యూమర్ ప్రొటెక్షన్ అథారిటీ (CCPA) మార్గదర్శకాలపై ప్రజాభిప్రాయం కోసం మార్చి 16 వరకు వీటిపై అభిప్రాయాలు తెలియజేయాలని సలహాలు సూచనలు com-ccpa@gov.inకు ఈమెయిల్ చేయాలని కోరింది.
![]() |
👉 కోర్సు పేరు (ఉచితమైన /పీజు చెల్లించిన) సంబంధించిన సమాచారాన్ని కోర్సును విజయవంతమైన అభ్యర్థి యొక్క కోర్సు ఎన్ని రోజులు లేదా వారి విషయాలను వినియోగదారుల నిర్ణయాధికారాన్ని ప్రభావితం చేసే ఇతర సమాచారాన్ని దాచి ఉంచినా తప్పుదోవ పట్టించడం కిందకే వస్తుంది.
👉 ఏదైనా పోటీ పరీక్షలో విద్యార్థుల విజయ రేటు ఎంపిక సంఖ్య లేదా సాధించిన ర్యాంకుల గురించి తెలియజేయడం కూడా మోసపూరిత చర్య కిందికే వస్తుంది.
👉 విద్యార్థుల యొక్క వ్యక్తిగత ప్రయత్నాలను గుర్తించకుండా విద్యార్థుల విజయం పూర్తిగా కోచింగ్ సెంటర్ కు మాత్రమే కారణమని తప్పుగా సూచించకండి వారి విజయంలో కోచింగ్ ప్రమేయం ఎంత మేర ఉందో స్పష్టంగా చెప్పండి.
👉 విద్యార్థులు లేదా తల్లిదండ్రులలో తప్పుడు భావాన్ని సృష్టించడం లేదా తప్పిపోతామని భయం విద్యార్థుల్లో ఆందోళనను పెంచవచ్చు తల్లిదండ్రులను కొత్త మార్గదర్శకాల ప్రకారం తప్పుదారి పట్టించేదిగా పరిగణించబడుతుంది.
👉కోచింగ్ సెంటర్లో నిమగ్నమైన ప్రతి వ్యక్తికి మార్గదర్శకాలు వర్తించబడతాయి. కోచింగ్ సెంటర్లో తప్పుదారి పట్టించే ప్రకటనల నుండి వినియోగదారులను రక్షించడం మార్గదర్శకాల లక్ష్యం.
👉కోచింగ్ లో నమోదు చేసుకోవడం వల్ల విద్యార్థికి ర్యాంకు అధిక మార్కులు తాత్కాలిక లేదా శాశ్వత ఉద్యోగం ఇనిస్ట్యూట్ లలో అడ్మిషన్లు ఉద్యోగ ప్రమోషన్లు జీతాల పెంపుదల వంటి వాటికీ గ్యారెంటీ ఇస్తుందని వినియోగదారులను నమ్మించడం లేదా తప్పుదారి పట్టించేవి కూడా చర్యల కిందకే పరిగణించబడతాయి.
వినియోగదారుల రక్షణ చట్టం 2019లోని సెక్షన్ 18 (2) (ఎల్) ప్రకారం నిర్వహించబడతాయి మరియు ప్రతిపాదిత మార్గదర్శకాలు వాటాదారులకు స్పష్టతనిస్తాయి మరియు వినియోగదారుల ప్రయోజనాలను పరిరక్షిస్తాయి.