రెండు తెలుగు రాష్ట్రాలలో పీపుల్స్ మోటివేషన్ తెలుగు దినపత్రికలో పనిచేయుటకు మండలాల వారీగా రిపోర్టర్లు, నియోజకవర్గ ఇంచార్జీలు, జిల్లా స్టాపర్లు కావలెను...✍️సంప్రదించండి: 80086 22746

-Advertisement-

రాష్ట్ర ప్రభుత్వానికి షాక్ ఇచ్చిన ఆంధ్రప్రదేశ్ హైకోర్టు...డీఎస్సీ నోటిఫికేషన్ పై హైకోర్టు స్టే

Ap high court dsc sgt case update? Ap high court dsc sgt case judgement? Ap high court dsc sgt case date? BEd students not eligible for SGT posts?
Peoples Motivation
రాష్ట్ర ప్రభుత్వానికి షాక్ ఇచ్చిన ఆంధ్రప్రదేశ్ హైకోర్టు

•డీఎస్సీ నోటిఫికేషన్ పై హైకోర్టు స్టే

•ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం విడుదల చేసిన డీఎస్సీ నోటిఫికేషన్ పై హైకోర్టులో విచారణ 

•అయోమయంలో లక్షలాది మంది విద్యార్థులు

అమరావతి (పీపుల్స్ మోటివేషన్):-

హై కోర్ట్ ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ధీరజ్ సింగ్ ఠాకూర్ మరియు జస్టిస్ రఘునందనరావు ధర్మాసనం ముందు విచారణ. పిటిషనర్ తరపున వాదనలు వినిపించిన ప్రముఖ న్యాయవాది జడ శ్రవణ్ కుమార్. ఎస్జీటీ టీచర్ పోస్టులకు బిఈడి అభ్యర్థులను కూడా అనుమతించడం సుప్రీంకోర్టు నిబంధనలకు వ్యతిరేకమన్న పిటిషనర్ న్యాయవాది జడ శ్రవణ్ కుమార్ బీఈడీ అభ్యర్థులను అనుమతించడం వలన లక్షల మంది డిఎడ్ అభ్యర్థులు తీవ్రంగా నష్టపోతున్నారన్న పిటిషనర్ న్యాయవాది. ప్రభుత్వం తరఫున అడ్వకేట్ జనరల్ శ్రీరామ్ వాదనలు వినిపించారు. ఎస్జీటీ పోస్టులకు బీఈడి అభ్యర్థులను అనుమతించవద్దు అంటూ రాష్ట్ర ప్రభుత్వానికి హైకోర్టు ఆదేశించింది. సుప్రీంకోర్టు నిబంధనలకు వ్యతిరేకంగా ఉన్న రాష్ట్ర ప్రభుత్వ జీవో పై స్టే విధిస్తూ ఆదేశాలు జారీచేసింది.

Images

నియామక ప్రక్రియ కొనసాగించాలి అంటే సుప్రీంకోర్టు నిబంధనలకు అనుగుణంగా మాత్రమే కొనసాగించాలి అంటూ రాష్ట్ర ప్రభుత్వానికి ఆదేశం తదుపరి విచారణ ఎనిమిది వారాలకు వాయిదా వేస్తూ ప్రధాన న్యాయమూర్తితో కూడిన ధర్మాసనం సంచలన నిర్ణయం తీసుకుంది. న్యాయస్థానం నిర్ణయంతో ఆరు లక్షల మందికి పైగా విద్యార్థులకు న్యాయం జరిగిందని పిటిషనర్ హర్షం వ్యక్తం చేశారు. 

Comments
Comment Poster
Jadasravanakumar

-Advertisement-