గూడెం లలో గుప్పు మంటున్న గుడుంబా..మొక్కు బడిగా అబ్కారి శాఖ..
గూడెం లలో గుప్పు మంటున్న గుడుంబా..మొక్కు బడిగా అబ్కారి శాఖ..
ప్రతి రెండేళ్లకు ఒక సారి వచ్చే మేడారం మహా జాతరకి తెల్ల బంగారంగా పిలువబడే తెల్ల బెల్లం ని మొక్కు గా మొక్కుకొని తులా భారం గా బెల్లం ని అమ్మ వార్లకు సమర్పిస్తారు. ఇలా ఈ మేడారం జాతర రెండు ఏళ్లకు ఒకసారి వస్తుంది కావున భక్తులు పెద్ద ఎత్తునా బెల్లం ని సమర్పిస్తారు. ఈ జాతరని అదనుగా చేసుకొని కొందరు అక్రమ బెల్లం వ్యాపారాలు గోదాం లలో, మరియు ఊరి చివర వున్న ఇండ్లలో, పాడు పడ్డ ఇండ్లలో అక్రమ వ్యాపారులుటన్నుల కొద్దీ, క్వింటాల కొద్దీ, బెల్లం ని అక్రమంగా నిల్వ చేసినా అధికారులు అటు వైపు కన్నెత్తి కూడా చూడటం లేదని ప్రజలు ఆరోపిస్తున్నారు. అధికారులా నిర్లక్షమే అక్రమ వ్యాపారలకు వరం గా మారింది అని ప్రజా సంఘాలు ఆరోపిస్తునాయి.
గ్రామ స్థాయి నుండీ మొదలు పెడితే జిల్లా స్థాయి వరకు గోదాం లలో, ఊరు చివర పాడు పడ్డ రూమ్ లలో, పంట పొలాల్లో, క్వింటాళ్ల కొద్దీ,టన్నుల కొద్దీ బెల్లంనిల్వ వున్న ఏ మాత్రం పట్టింపు లేకుండా వున్న అధికారులు. గ్రామాలలో మధ్య రాత్రి మొదలుకొని తెల్ల వారు జామున అయిదు గంటల వరకు జోరుగా నడుస్తున్న అక్రమ దందా నీ ఆపలేని స్థితిలో అదికారులు..
గూడెం లలో గుప్పు మంటున్న గుడుంబా..
మేడారం జాతర కు మొదలుకొని బెల్లం నీ అధికంగా కొనుగోలు చేసి తండాలో నిల్వ చేసారు. అన్ని తెలిసినా అదికారులు రారు... ఆపరు.....?
తండాలో టన్నుల కొద్ది నిల్వ వుంచిన బెల్లం నీ గుట్టు చప్పుడు కాకుండా మధ్య రాత్రి సమయాన ఉదయం సమయాన గుడుంబా యదేచ్చగా కొనసాగుతున్న అధికారుల మౌనం వెనుక వున్న మర్మం ఏంటో ఆని గుడుంబా కి బానిస అయిన కుటుంబాలు పెద్ద ఎత్తున విమర్శలు వెల్లువెత్తున్నాయి.
మెరుపు దాడులు...
నిత్యం గుడంబా కి అలవాటు పడిన వ్యక్తులు విచక్షణ రహితంగా ప్రవర్తిస్తూ ప్రాణాలను సైతం లెక్క చేయకుండా గుడుంబా వలలో పడి చిన్న బిన్నం అవుతున్నా తండాలో కుటుంబాలు ఎన్నో......
దాడులు దాగుడు మూతలు లాగా వున్నాయి అని మొక్కు బడిగా వున్నాయి అని మెరుపు దాడులు గా వున్నాయి అని ప్రజా సంఘాలు, ప్రజలు, మేదావులు పెద్ద ఎత్తున ఆరోపణలు, విమర్శలు, వెల్లువెత్తున్నాయి సంబంధిత శాఖ పై..✍️
బీరవెళ్ళీ అవినాష్
ఎంఏ, ఏంసీజె(జర్నలిజం)
జర్నలిస్ట్