చిరంజీవికి పద్మవిభూషణ్
కొణిదెల చిరంజీవికి పద్మవిభూషణ్ రావడం కాపు జాతికే గర్వకారణం:కొట్టె మల్లికార్జున కాపు సంక్షేమ సేన నాయకులు.
కృషితో నాస్తి దుర్భిక్షం, శ్రమ నీ ఆయుధమైతే విజయం నీ బానిస అవుతుందని పేర్కొంటారు. సినీ ఇండస్ట్రీలో ఒక్క వ్యక్తిగా మొదలైన తన ప్రస్థానాన్ని స్వయంకృషితో అంచలంచలుగా ఎదుగుతూ ఒక శక్తిగా ప్రభంజనాన్ని సృష్టించిన అంజనీ దేవి అంజనీ పుత్రుడు కొణిదెల శివశంకర్ వరప్రసాద్ చిరంజీవి గా సుపరిచితులు. చిరంజీవి దేశంలో అత్యున్నత రెండవ పురస్కారమైన పద్మ విభూషణ్ కు కేంద్రములో ఉన్నటువంటి బిజెపి ప్రభుత్వం మొత్తం అయిదు మందిని ఎంపిక చేసిన విషయం తెలిసిందే. సినీ ఇండస్ట్రీకి మెగా స్టార్ అయిన చిరంజీవిని ఎంపిక చేయడాన్ని దేశంలో ఉన్నటువంటి కాపు, బలిజ నాయకులు, అఖిల భారత చిరంజీవి యువత అభిమానులు,పవన్ కళ్యాణ్, నాగబాబు,రామ్ చరణ్, అల్లు అర్జున్, వరుణ్ తేజ్,సాయి ధరమ్ తేజ్, వైష్ణవ్ తేజ్, అభిమానులు,అలాగే ఇతర దేశాల్లో ఉన్నటువంటి చిరంజీవి అభిమానులు అందరూ హర్షం వ్యక్తం చేస్తున్నారు. ఉమ్మడి కర్నూలు జిల్లాలో కాపు, బలిజ నాయకులు అందరూ కాపు నాడు రాష్ట్ర అధ్యక్షులు అర్జా రామకృష్ణ నేతృత్వంలో చిరంజీవికి పద్మవిభూషణ్ అవార్డు లభించినందుకు కాపుల ఆరాధ్య దైవం శ్రీ కృష్ణ దేవరాయలు విగ్రహానికి పూలమాల వేసి, కేక్ కట్ చేసి చిరంజీవి పై తమ అభిమానాన్ని కాపు పెద్దలు, యువనాయకులు, అభిమానులు చాటుకున్నారు.అర్జా రామకృష్ణ మాట్లాడుతూ కాపు జాతి గర్వపడేలా కొణిదెల చిరంజీవికి పద్మవిభూణ్ రావడం ఆనందంగా ఉంది. దీనితో కాపు, బలిజ నాయకులు, అఖిల భారత చిరంజీవి యువత, అభిమానులు ఎప్పుడూ ఆయన వెంట ఉంటామని పేర్కొన్నారు. కాపు యువ నేత మరియు బిజెపి యువ నాయకులు కొట్టె మల్లికార్జున మాట్లాడుతూ చిరంజీవిని చిన్నప్పటి నుంచి చూస్తూ పెరుగుతూ, ఆయన్ని స్ఫూర్తి గా తీసుకొని సినిమాల్లోకి రావడమే కాక, ఎంతోమంది మహనీయులని స్ఫూర్తిగా తీసుకొని రాజకీయ రంగం లోకి రావడం జరిగింది .అదేవిధంగా ఏ రంగంలోకి వెళ్లిన పదిమందికి సాయం చేయాలనే చిరంజీవి వ్యక్తిత్వమే మా లాంటి ఎంతో మంది కాపు యువ నాయకులకు,అభిమానులకు ,ఆదర్శం.ఆయన వెన్నంటే మేము అందరం కాపు యువకులుగా ,కాపు యువ నాయకులుగా ఉంటాం .మేము ప్రతి ఒక్కరికి అండగా ఉంటూ, ప్రతి ఒక్కరికి సహాయ, సహకార కార్యక్రమంలో పాల్గొంటామని పేర్కొన్నారు.2006 లో పద్మభూషణ్ అవార్డు అందుకోవడం మరియు దశాబ్దాలకు పైగా చలనచిత్ర సీమలో మకుటం లేని మహారాజుగా, మెగాస్టార్ గా ఉండడము, ఎంతోమంది అభిమానులకు, పేద ప్రజలకు కరోనా సంక్షేమ సమయంలో కూడా చిరంజీవి చారిటబుల్ ట్రస్ట్ ఏర్పాటుచేసి సేవలు అందించడం, మరియు చిరంజీవి బ్లడ్ బ్యాంక్ ద్వారా ఎంతోమంది ప్రాణాలను కాపాడినటువంటి అంజనీ పుత్రుడు చిరంజీవికి రాబోయే రోజుల్లో భారతరత్న రావాలని మనస్ఫూర్తిగా కాపు యువనేతగా, చిరంజీవి అభిమానిగా కోరుకుంటున్నాను అని కొట్టె మల్లికార్జున పేర్కొన్నారు