క్రీడా బిందు అవార్డు ప్రధానో ఉత్సవం...
Dhone news, ap news, kurnool news, use full news
By
Peoples Motivation
క్రీడా బిందు అవార్డు ప్రధానో ఉత్సవం
డోన్, ఫిబ్రవరి 11 (పీపుల్స్ మోటివేషన్):-
కర్నూలు పట్టణంలోని స్కంద హిల్స్ నందు ఆంధ్రప్రదేశ్ రింగ్ ఫైట్ అసోసియేషన్ వారు క్రీడా బిందు అవార్డు ప్రధానోత్సవం నిర్వహించారు. డోన్ పట్టణానికి చెందిన రామ్స్ స్కూల్ ఆఫ్ కరాటే విద్యార్థిని శ్రీనిత్య ఎంపిక కావడం జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా విచ్చేసిన కర్నూలు మేయర్ బీవీ రామయ్య వారి చేతుల మీదుగా ప్రశంసా పత్రం అందజేశారు. అలాగే బెస్ట్ కోచ్ గా రమణను ప్రశంసాపత్రంతో సత్కరించారు. ఈ కార్యక్రమంలో రింగ్ ఫైట్ అసోసియేషన్ అఫ్ ఇండియా ప్రెసిడెంట్ రవి ఆంధ్రప్రదేశ్ స్టేట్ ప్రెసిడెంట్ దేవా ఎపి రింగ్ ఫైట్ అసోసియేషన్ సెక్రటరీ అబ్దుల్లా మిగిలిన కార్యవర్గ సభ్యులు పాల్గొన్నారు.
Comments