వైసీపీ ప్రభుత్వంలోని నవరత్నాలకు చిల్లులు పడ్డాయి...
వైసీపీ ప్రభుత్వంలోని నవరత్నాలకు చిల్లులు పడ్డాయి...
కరోనా విపత్తులో 220 దేశాలకు వ్యాక్సిన్ ఇచ్చిన ఘనత బిజెపి కి దక్కుతుంది....
రాష్ట్రంలో బిజెపి నీ ఆదరించండి...అభివృద్ధి చేసి చూపిస్తాం...
నంద్యాల, ఫిబ్రవరి 27 (పీపుల్స్ మోటివేషన్):-
దేశవ్యాప్తంగా ప్రజల కోసం 704 పథకాలు అందిస్తున్న ఘనత ప్రధాని నరేంద్ర మోడీకి దక్కుతుంది అని నంద్యాల బిజెపి అసెంబ్లీ కన్వీనర్ అభిరుచి మదు పేర్కొన్నారు. ప్రజా పోరు యాత్రలో భాగంగా నంద్యాల పట్టణంలోని మసీదు సెంటర్, విసి కాలనీ, పెద్ద చర్చి, ఎం.ఎస్.నగర్, మూల సాగరం, గౌసియా నగర్ ప్రాంతాల్లో యాత్ర నిర్వహించారు. కాలనీకి చేరుకోగానే మహిళలు పెద్ద ఎత్తున పాల్గొని పూల వర్షం కురిపించారు. టపాకాయలు పేల్చి బిజెపి నాయకులకు ఘనస్వాగతం పలికారు. ఈ సందర్భంగా ప్రజలను ఉద్దేశించి ఆయన మాట్లాడుతూ దేశవ్యాప్తంగా ప్రజల కోసం 704 పథకాలు అందిస్తున్న ఘనత ప్రధాని నరేంద్ర మోడీ కి దక్కుతుందని అన్నారు. ప్రధానమంత్రి మోడీ అధికారంలోకి వచ్చాక రాష్ట్ర ప్రభుత్వానికి దాదాపు 10 లక్షల కోట్లు అభివృద్ధికి ఇచ్చారని పేర్కొన్నారు. మహిళలు ఇబ్బందులు పడకుండా ఉచిత గ్యాస్ కనెక్షన్లు, మరుగుదొడ్లు ఏర్పాటయ్యాయి అన్నారు. రెండురోజుల క్రితం దేశవ్యాప్తంగా 41 వేల కోట్ల విలువైన రైల్వే ప్రాజెక్టులు,1500 రోడ్ ఓవర్ బ్రిడ్జి లు వర్చువల్ గా ప్రధాని ప్రారంభించారని అన్నారు. రాష్ట్రంలో రైల్వే స్టేషన్లు కొన్ని రూపురేఖలు మారిపోయాయన్నారు. రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన నవరత్నాలు చిల్లులు పడ్డాయని అన్నారు. జగన్ ప్రభుత్వంలో బిజెపి ప్రభుత్వ పథకాలకు రంగులు, స్టిక్కర్లు వేసి పబ్బం గడుపుతున్నారని అన్నారు. కరోనా విపత్తులో 220 దేశాలకు వ్యాక్సిన్ అందించి ఎందరో ప్రాణాలు కాపాడారన్నారు. జగన్ ప్రభుత్వంలో కరోనా సోకిన వారికి వ్యాక్సిన్ అందించకుండా పారాసిటమల్ టాబ్లెట్ వేసుకుంటే తగ్గిపోతుందని చెప్పిన ప్రభుత్వం వైసీపీ ప్రభుత్వమని ఎద్దేవా చేశారు. కేంద్ర నిధులకు సోకులు చేయడంతో హైకోర్టు తో చివాట్లు తిన్నారని పేర్కొన్నారు. అవినీతి,అరాచకాలు, భూ కబ్జా లకు కేరాఫ్ అడ్రస్ గా వైసిపి ప్రభుత్వం మారిందన్నారు. వైసిపి ప్రభుత్వంలో ప్రజలు ఇబ్బందులు పడుతున్నారని అన్నారు. రాష్ట్రంలో అభివృద్ధి నిల్-ఉద్యోగాలు నిల్-జాబ్ క్యాలెండర్ నిల్-పరిశ్రమలు నిల్- ఉన్న పరిశ్రమలు పక్క రాష్ట్రాలకు తరలిపోతున్నాయని పేర్కొన్నారు. అవసాన దశలో ఉన్న రాష్ట్రాన్ని కాపాడాలని ప్రధాని నరేంద్ర మోడీ ప్రత్యేక దృష్టి సారించారని పేర్కొన్నారు. శిల్పా కుటుంబం వ్యాపారం పేరుతో వచ్చి ప్రజలకు మాయమాటలు చెప్పి వడ్డీ లేని రుణాలు ఆశ చూపించి అధికారంలోకి వచ్చారని ఆరోపించారు. దోమల నివారణ చేయించాలని అసమర్థ ఎమ్మెల్యే శిల్పా అన్నారు. ఏ వార్డులో ఏమున్నది గర్వకారణం అన్న చందంగా రోడ్లు లేవు,కాల్వలు లేవు,చెట్టపై పన్ను వసూలు చేసే చెత్త ప్రభుత్వం అన్నారు. ఈ ప్రాంతంలో వైసీపీ అభ్యర్థి గెలవకపోవడంతో ఒక్క రూపాయి అభివృద్ధికి నిధులు మంజూరు చేయలేదన్నారు. శిల్పా కు అనుకూలమైన వార్డుల్లో అభివృద్ధి జరుగుతుందని అన్నారు. శిల్పా అరాచకాలు రోజు,రోజు వెలుగులోకి వస్తున్న విషయం ప్రజలకు తెలుసన్నారు. దేశంలో బిజెపి ప్రభుత్వాన్ని ఆదరిస్తున్నారని, రాష్ట్రంలో బిజెపి ప్రభుత్వాన్ని ఆదరిస్తే అభివృద్ధి ఉరకలు వేస్తుందని అన్నారు. ఈ కార్యక్రమంలో నిమ్మకాయల సుధాకర్,హసీనా,చెన్నమ్మ,ఉపేంద్ర నాథ్ రెడ్డి,లక్ష్మి రెడ్డి,చంద్రశేఖర్, బసవరాజ్,ఈశ్వర్,కృష్ణా రెడ్డి,స్వాతి,బలరాం తదితరులు పాల్గొన్నారు.