ఓటు హక్కు నమోదు చేసుకోని విద్యార్థులను గుర్తించి ఓటు నమోదు చేపించండి
ఓటు హక్కు నమోదు చేసుకోని విద్యార్థులను గుర్తించి ఓటు నమోదు చేపించండి
ఎన్నికల సన్నద్ధత ప్రణాళిక సిద్ధం చేయండి
ఓటు హక్కు నమోదు చేసుకోని విద్యార్థులను గుర్తించి ఓటు నమోదు చేపించండి
నోడల్ అధికారులను ఆదేశించిన జిల్లా కలెక్టర్ డా. కె.శ్రీనివాసులు
నంద్యాల, ఫిబ్రవరి 17 (పీపుల్స్ మోటివేషన్):-
2024 సార్వత్రిక ఎన్నికల సన్నద్ధత నిర్వహణ ప్రక్రియను ప్రణాళిక రచనతో వేగవంతంగా పూర్తి చేసుకోవాలని జిల్లా కలెక్టర్ డా. కె.శ్రీనివాసులు 16 కమిటీల నోడల్ అధికారులను ఆదేశించారు. శనివారం ఆయన ఛాంబర్ లో జాయింట్ కలెక్టర్ టి. రాహుల్ కుమార్ రెడ్డితో కలిసి ఎన్నికల సంసిద్ధతపై నోడల్ అధికారులతో సమావేశం నిర్వహించారు.
ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ డా. కె.శ్రీనివాసులు మాట్లాడుతూ.. వచ్చే సార్వత్రిక ఎన్నికల సన్నద్ధత ప్రక్రియను వేగవంతం చేయడంతో పాటు ఎన్నికల సంఘం సూచించిన అన్ని అంశాలపై అప్రమత్తంగా ఉండి విధులను నిర్వహించాలని నోడల్ అధికారులను ఆదేశించారు. పోలింగ్ విధుల నిర్వహణకు అన్ని శాఖల సిబ్బంది వివరాలు తెప్పించుకొని రాండమైజేషన్ పద్ధతిలో విధుల కేటాయింపుకు సిద్ధంగా ఉండాలని మ్యాన్ పవర్ మేనేజ్మెంట్ కమిటీ నోడల్ అధికారిని కలెక్టర్ ఆదేశించారు.
అన్ని కళాశాలలు, విద్యాసంస్థల్లో ఇంకా ఓటు హక్కు నమోదు చేసుకోని విద్యార్థులను గుర్తించి ఫార్మ్ 6 ద్వారా వివరాలు సేకరించి నమోదు చేసే ప్రక్రియపై దృష్టి సారించాలని స్వీప్ నోడల్ అధికారిని ఆదేశించారు. పోలింగ్ నిర్వహించే సిబ్బందికి శిక్షణ కార్యక్రమాలు ఇవ్వాలని ట్రైనింగ్ మేనేజ్మెంట్ కమిటీ నోడల్ అధికారిని సూచించారు. పోలింగ్ మెటీరియల్ సరఫరా లోటుపాట్లు లేకుండా నివేదికలు తయారు చేసుకుని సిద్ధంగా ఉంచుకోవాలని మెటీరియల్ మేనేజ్మెంట్ నోడల్ అధికారిని కలెక్టర్ ఆదేశించారు. ఎన్నికల విధుల్లో ప్రతి ఉద్యోగికీ పోస్టల్ బ్యాలెట్ అవకాశం కల్పించేందుకు ఏర్పాట్లు చేసుకోవాలని కలెక్టర్ ఆదేశించారు. ఎలక్ట్రానిక్ ఓటింగ్ యంత్రాల పరిశీలన, భద్రత, ట్రాన్స్పోర్ట్, తదితర అంశాలపై జాగ్రత్తలు తీసుకోవాలని ఈవీఎం మేనేజ్మెంట్ నోడల్ అధికారిని సూచించారు. ఎన్నికల ప్రవర్తన నియమావళి, ఎన్నికల్లో పోటీ చేసే అభ్యర్థుల ఖర్చు వివరాలపై పర్యవేక్షించేందుకు యంసిసి బృందాలను ఏర్పాటు చేసుకోవాలని ఎక్స్పెండిచర్ మానిటరింగ్ కమిటీ నోడల్ అధికారులను కలెక్టర్ ఆదేశించారు. కమ్యూనికేషన్ ప్లాన్, ఎలక్ట్రోరల్ రోల్ పై ఎప్పటికప్పుడు చర్యలు చర్యలు తీసుకోవాలని సంబంధిత కమిటీ నోడల్ అధికారులను సూచించారు.