తెలంగాణ కుంభమేళా...
"తెలంగాణ కుంభమేళా"
గుడి లేదు, గోపురం వుండదు అమ్మ వార్ల ఆకారం కనిపించదు. అర్చనలు, అభిషేకాలు కానరావు అయితేనేం కోట్లమంది భక్తుల ఆరాధ్య దైవం వీరోచిత పోరాటం తో వన దేవతలుగా కోట్ల మంది భక్తుల ఇలవేల్పుగా కొలువబడుతున్నారు, సమ్మక్క సారలమ్మ లు.
కేవలం రెండు గద్దెలపై పసుపు, కుంకుమ, చీర, సారేతో పాటు బంగారంగా పిలువబడే బెల్లం తో, మొక్కులు చెల్లించడం ఆనవాయితీ. గిరిజన సాంప్రదాయ పద్దతిలో రెండు ఏళ్ళకు ఒక్కసారి జరిగే మేడారం మహా జాతరకు సమయం ఆసన్నమైంది.ఈ మహజతరకు కుంభమేళాను తలపించే మేడారం సమ్మక్క సారలమ్మ మహా జాతరకు సర్వం సిద్ధమైంది. ముందుగానే భక్తుల సందడి మొదలైంది.
మేడారం జాతర ప్రత్యేకత....
900 సంవత్సరాల చరిత్ర కలిగిన మేడారం జాతరను 1940 నుంచి 1968 వరకు చిలుకల గుట్ట పై కోయ జాతి గిరిజనులు మాత్రమే జరుపుకునేవారు, రాను రానూ తెలంగాణ ప్రజలు అంతా జరుపుకునే జాతరగా మారింది, ఏట ఏటా జాతరకు జనం పెరగటం తో చిలుకల గుట్ట కింద జరపడం ప్రారంభించారు. అడవి ప్రాంతం లో వన దేవతల జాతరను వైబోవం గా నిర్వహిస్తునారు. వాస్తవానికి సమ్మక్క సారలమ్మ లు కొండ జనుల గిరిజనుల కోసం పోరాటం చేసి అసువులు బాసిన వీర వనితలు వారి పోరాట స్ఫూర్తికి నేడు దైవంగా భావిస్తూ దేవతలుగా కొలుస్తున్నారు.
ఆడబిడ్డల ఆత్మ గౌరవాన్ని పోరాడి పటిమతో చాటి చూపి దైర్య సాహసాలతో, అద్భుత శక్తులతో, దేవతలుగా వెలసిన శాంభవి అవతారమే సమ్మక్క, దేశం లోనే అతి పెద్ద గిరిజనుల ఉస్సవం మేడారం సమ్మక్క సారలమ్మ ల జాతర.
తాడ్వాయి మండలం లోని దట్టమైన అడవి ప్రాంతం మేడారం, ప్రతీ రెండు సంవసరాలకు ఒక సారి మగ శుద్ధ పౌర్ణమి న గిరిజనులు, గిరిజనేతరులు కూడా సమ్మక్క సారలమ్మ లకు మొక్కులు చెల్లించు కొని ఆ తల్లి దర్శనం తో పునితలు అవుతారు.
వందల ఎండ్ల్లు జరిగినా, తరాలు ఎన్నో తరిలి పోయినా ఆడ బిడ్డల వీర కొలువగా జాతి ఎన్నడు మరువక ఇప్పుడు జాతర చేసి కొలుస్తున్నారు, సమ్మక్క సారలమ్మ లను.