రెండు తెలుగు రాష్ట్రాలలో పీపుల్స్ మోటివేషన్ తెలుగు దినపత్రికలో పనిచేయుటకు మండలాల వారీగా రిపోర్టర్లు, నియోజకవర్గ ఇంచార్జీలు, జిల్లా స్టాపర్లు కావలెను...✍️సంప్రదించండి: 80086 22746

-Advertisement-

వైఎస్ జగన్ కు ఎలక్షన్ స్లోగన్ లేకుండా చేస్తున్న చంద్రబాబు

Chn news, Chandra Babu news, cbn satires on jagan
Peoples Motivation

  •  వైఎస్ జగన్ కు ఎలక్షన్ స్లోగన్ లేకుండా చేస్తున్న చంద్రబాబు
  • జగన్ డైలాగ్ లతో జగన్ కే చంద్రబాబు పర్ఫెక్ట్ కౌంటర్లు
  • స్టైల్ మార్చిన టీడీపీ అధినేత - రొటీన్ స్పీచ్ లకు గుడ్ బై
  • మీ బిడ్డ అనే జగన్ స్లోగన్ కు..కాదు అతను క్యాన్సర్ గడ్డ అంటూ ఎన్కౌంటర్
  • సిద్ధం అని జగన్ అంటే...ఓడించడానికి జనం సిద్ధం అంటూ కౌంటర్
  • ప్రజలే స్టార్ క్యాంపెయినర్లన్న సిఎం...అవును జగన్ పతనానికి జనమే స్టార్ క్యాంపెయినర్లన్న చంద్రబాబు
  • విశ్వసనీయత అనే జగన్ గొప్పలపై....లైవ్ లో వీడియోలు వేసి మరీ నిలదీస్తున్న ప్రతిపక్ష నేత
  • భిన్నంగా, సూటిగా, ఘాటుగా బాబు ప్రసంగాలు
  • లెక్కలు, అంకెల స్థానంలో బాబు ప్రసంగాల్లో సామెతలు, సుమతీ శతకాలు


నారా చంద్రబాబు నాయుడు స్టైల్ మార్చారు. సుదీర్ఘంగా, కొత్తదనం లేకుండా సాగే తన ప్రసంగాల తీరును సమూలంగా మార్చేశారు. రా కదలి రా సభల్లో చంద్రబాబు పసంగాలు ప్రజలను ఆలోచింప చేసేలా, వైసీపీ ప్రభుత్వాన్ని దుమనాడేలా, సిఎంను తూర్పార బట్టేలా సాగుతున్నాయి. అటు క్యాడర్ లో ఉత్సాహాన్ని నింపుతూ...ఇటు న్యూట్రల్స్ ను ఆలోచింపజేసేలా చంద్రబాబు ప్రసంగాలు కొత్త రూపు సంతరించుకున్నాయి. లాంగ్వేజ్ లో, బాడీ లాంగ్వేజ్ లో కొత్తదనం చూపుతూ ఆయన అనుసరిస్తున్న స్టైల్ క్యాడర్ కు కిక్కిస్తోంది. ప్రభుత్వం సమాధానం చెప్పుకోలేక డిఫెన్స్ లో పడే పరిస్థితి తెస్తోంది. సుమతీ శతకాలు, సామెతలు, పురాణ కథలు చెపుతూ...ఆసక్తి కలిగించేలా చంద్రబాబు ప్రసంగాలు సాగుతున్నాయి.

ముఖ్యంగా చెప్పాలి అంటే జగన్ కు ఎన్నికల స్లోగన్ లేకుండా చేయడంలో చంద్రబాబు పూర్తి ఫోకస్ పెట్టినట్లు ఆయన  ప్రసంగాలు చూస్తే అర్థం అవుతుంది. 2019 ఎన్నికల్లో బై బై బాబు అంటూ వైసీపీ దూకుడుగా పోతే అధికారంలో ఉండి కూడా కౌంటర్ ఇచ్చుకోలేకపోయిన టీడీపీ...ఇప్పుడు అధికార పక్షానికి స్లోగన్ అనేదే లేకుండా చేస్తోంది.

జగన్ భీమిలి సభలో పద్మవ్యూహంలో చిక్కుకోవడానికి తాను అభిమన్యుడిని కాదు అర్జునుడిని అన్నారు. దీనిపై పీలేరు రా కదలి రా సభలో కౌంటర్ ఇస్తూ చంద్రబాబు అయ్యా పురాణ పురుషా నువ్వు అభిమన్యుడివీ కాదు...ఆయన తండ్రి అర్జునుడివీ కాదు. నువ్వు మా రాష్ట్ర ప్రజల పాలిట భస్మాసురుడివి అని సెటైర్ వేశారు. దీంతో జగన్ అంతెత్తున తనుకు తాను చేసుకున్న పోలికను అవే పురాణాలను ప్రస్తావించి జగన్ గాలి తీసేశారు. జగన్ ఇక ఎప్పుడు అర్జునుడు అన్నా....ప్రతిపక్షం అంతా భస్మాసురుడు అని కౌంటర్ ఇచ్చేందుకు లైన్ ఇచ్చారు. దీంతో జగన్  ఎప్పుడు అర్జునుడితో పోల్చుకున్నా....భస్మాసురుడు అనే ప్రతి విమర్శ వినిపిస్తూనే ఉంటుంది.

ముఖ్యమంత్రి జగన్ తన సభల్లో మీ బిడ్డా మీ బిడ్డ అని ఊదరగొడుతున్నారు. దీంతో జగన్ మీ బిడ్డ కాదు క్యాన్సర్ గడ్డ అని చంద్రబాబు చాలా స్ట్రాంగ్ కౌంటర్ ఇస్తున్నారు. కేవలం పంచ్ డైలాగ్ కొట్టడమే కాకుండా ఆయా వర్గాలకు జగన్ పాలనలో జరిగిన నష్టాలను వివరిస్తూ ఎందుకు క్యాన్సర్ గడ్డో చెపుతూ ఎండగడుతున్నారు.

అలాగే మొన్న భీమిలి సభద్వారా జగన్ సిద్దం అనే థీమ్ ను తీసుకుని జనంలోకి వెళ్లే పని మొదలు పెడితే...ఆ సభ మొదలవ్వకముందే సిద్ధం స్లోగన్ కు కౌంటర్ ఇచ్చి దాన్ని ఎన్ కౌంటర్ చేశారు చంద్రబాబు. అవును జగన్ నువ్వు చెపుతున్నట్లు అంతా సిద్ధం...నిన్న ఓడించడానికి యువత సిద్ధం, రైతులు సిద్ధం, ఉద్యోగులు సిద్ధం, బాధిత వర్గాలు అన్నీ సిద్ధం అంటూ ముందే ఎదురు దాడికి దిగారు. ఈ తరహా కౌంటర్ కొంత కొత్తదనంతో సాగింది.

ఇక జగన్ చెప్పిన ప్రజలే స్టార్ క్యాపెంయినర్లు అనే విషయంలో కూడా చంద్రబాబు చాలా సింపుల్ పదాలతో...ఆ వ్యాఖ్యలకు కౌంటర్ ఇచ్చారు. అవును ప్రజలే రేపు ఎన్నికలకు స్టార్ క్యాంపెయినర్లు జగన్ రెడ్డీ నువ్వు చెప్పింది నిజమే. నీ బాధిత 5 కోట్ల మంది ప్రజలూ రేపు మాకు స్టార్ క్యాంపెయినర్లే, నిరుద్యోగ యువత, భద్రత లేని మహిళలు, ఎండిన పొలాలు, ఆగిన సాగునీటి ప్రాజెక్టులు, బాధిత దళిత, బడుగు వర్గాలు కూడా రేపు నిన్ను ఓడించడానికి స్టార్ క్యాంపెయినర్లే అంటూ పర్ ఫెక్ట్ కౌంటర్ ఇచ్చారు.

అలాగే జగన్ చెప్పే విశ్వసనీయతపై....98 శాతం హామీలు అమలు చేశాను అంటున్న ప్రకటనలపై మరింత ఘాటుగా చంద్రబాబు స్పందిస్తున్నారు. జగన్ నాడు ఇచ్చిన హామీలు.....చేసిన వాగ్దానాల వీడియోలను ఏకంగా తన సభలో ప్లే చేస్తున్నారు. రా కదలి రా సభల్లో పెద్ద స్క్రీన్ లపై జగన్ నాటి హామీలను ప్రసారం చేసి....వీటి సంగతి ఏంటి జగన్...ఇదేనా విశ్వసనీయత అంటే అని ప్రశ్నిస్తున్నారు. ఆ వీడియోలు అన్నీ వేసి మరీ....కేంద్రం మెడలు వంచి ప్రత్యేక హోదా తెచ్చావా, మద్య నిషేధం చేశావా, బాబాయి హంతకులు అరెస్టు అయ్యారా, సిపిఎస్ రద్దు జరిగిందా, జాబ్ క్యాలెండర్ ఇచ్చావా, డిఎస్సీలు వేశావా, పోలవరం కట్టావా, రాజధాని పూర్తి చేశావా, కరెంట్ బిల్లులు తగ్గించావా అంటూ సభా ముఖంగానే ప్రశ్నిస్తున్నారు. సభలో లైవ్ లో ప్లే చేస్తున్న ఈ వీడియోలు ఇటు టీడీపీ వారు గట్టిగా ప్రశ్నించడానికి కాన్ఫిడెన్స్ ఇవ్వడంతో పాటు...వైసీపీ వారిని గుచ్చినట్లు ఉంటున్నాయి. ఈ వీడియోలు జగన్ కు, వైసీపీ నేతలకు పంటికింద రాయిలా తగులుతున్నాయి. ఇదండీ జగన్ విశ్వసనీయత అని సవాల్ చేసి అడగడం ద్వారా చంద్రబాబు వైసీపీ శిబిరాన్ని డిఫెన్స్ లోకి నెట్టేస్తున్నారు. దీంతో ఎప్పటిలా వీటికి సమాధానం చెప్పకుండా తమదైన తిట్లతోనే వైసీపీ మంత్రులు, నేతలు ప్రెస్ మీట్లు పెడుతున్నారు.

జగన్ భీమిలి సభలో ఊరూరా నా మార్క్ అని చెపితే...దానికి కూడా చంద్రబాబు పొన్నూరు సభలో గట్టిగానే రిప్లై ఇచ్చారు. 9 సార్లు విద్యుత్ ఛార్జీల పెంపు, 50 రూపాయల మద్యం బాటిల్ 200 రూపాయాలు, ఉచితంగా దొరికే ఇసుక బంగారం అవ్వడం, నిరుద్యోగంలో రాష్ట్రాన్ని నెంబర్ చేయడం, తండ్రి హత్యపై పోరాడుతున్న చెల్లిపైనే కేసు పెట్టడం కూడా నీ మార్కే అంటే చంద్రబాబు ఆయా అంశాలను ప్రస్తావిస్తూ జగన్ ను నిలదీశారు. 



ఇలా రా కదలి రా సభల్లో చంద్రబాబు ప్రసంగాలు, తీసుకుంటున్న అంశాలు కొత్తగా సాగుతున్నాయి. గత ఎన్నికల్లో జగన్ పార్టీ చంద్రబాబు పై ఒక స్లోగన్ తెస్తే దానికి కౌంటర్ కూడా నాడు ఇవ్వలేక పోయారు. అయితే ఇప్పుడు జగన్ ఏం చెప్పినా దానికి ఫిట్టింగ్ రిప్లై ఇస్తూ వచ్చే ఎన్నికలకు జగన్ కు పర్ ఫెక్ట్ స్లోగన్ లేకుండా చంద్రబాబు మాటల దాడి చేస్తున్నారు.
వైసీపీకి మీడియా బలం ఎంత ఉన్నా....చంద్రబాబు చేస్తున్న ఈ డైరెక్ట్ హిట్ సోషల్ మీడియా ద్వారా మెల్లగా సామాన్య ప్రజల్లోకి వెళుతోంది. కొన్ని సమాధానం చెప్పుకోలేని ప్రశ్నలు అధికార పార్టీని ఉక్కిరి బిక్కిరి చేస్తున్నాయి. ప్రజలు కూడా లిజనింగ్ మూడ్ లో ఉండడంతో వైసీపీ ఆత్మరక్షణలో పడుతుంది.

ప్రజల ఆలోచనల్లో మార్పు తేవడంలో ప్రసంగాలు చాలా కీలకం. ప్రస్తుతం మంచి జోరు, స్పీడు మీద ఉన్న చంద్రబాబు దీన్ని మరింత దూకుడుగా ముందుకు తీసుకువెళ్లాల్సిన అవసరం ఉంది. అధికార పక్షం చెప్పిన దానికి సమాధానం ఇచ్చుకునే విధానం నుంచి అధికారం పక్షం సమాధానం చెప్పుకోలేని పరిస్థితి క్రియేట్ చేయాల్సి ఉంది. మరి రానున్న రోజుల్లో బాబు స్పీడుకు బ్రేకులు వేసేందుకు వైసీపీ ఎలాంటి వ్యూహాలు రచిస్తుందో...ఎలాంటి స్లోగన్స్ తో, ప్రణాళికతో ముందుకు వస్తుందో చూడాలి. ప్రస్తుతానికి మాత్రం జగన్ తీసుకున్న ప్రతి స్లోగన్ ను తిప్పి కొట్టడంలో చంద్రబాబు పూర్తిగా సక్సెస్ అయ్యారు అని చెప్పవచ్చు.




Comments

-Advertisement-