#ANUCDE_దూరవిద్యకు దూరమవుతున్న అసలు విద్యార్థులు
దూరవిద్యకు దూరమవుతున్న అసలు విద్యార్థులు
👉 పట్టణానికి దూరంగా పరీక్షా సెంటర్లు
👉 దూరవిద్య పరీక్షల్లో మాస్ కాపీయింగ్ తెరలేపిన విద్యా సెంటర్లు పరీక్ష కేంద్రాలు
👉 బంతి భోజనాల తీరు తలపిస్తున్న నిర్వహణ
👉 ఒకరికి బదులు మరొకరితో రాయిస్తున్నట్లు ఆరోపణలు
👉 మాస్ కాపీయింగ్ లో ప్రతిభ చూపుతున్న కూలీ విద్యార్థులు
👉 రోజు కూలీ రూ. 300 నుంచి 500 వరకూ...!
👉 ఓపెన్ డిగ్రీ పరీక్షల్లో కొరవడిన పర్యవేక్షణ
కర్నూలు/నంద్యాల, ఫిబ్రవరి 22 (పీపుల్స్ మోటివేషన్):-
ఆచార్య నాగార్జున యూనివర్సిటీ పరిధిలోని ఓపెన్ డిగ్రీ పరీక్షల్లో మాస్ కాపీయింగ్ జోరుగా సాగుతోంది. పరీక్ష కేంద్రాలతో స్టడీ సెంటర్లు కుమ్మక్కై దందాకు తెరతీశాయి. ఇదే అదునుగా విద్యార్థుల నుంచి భారీ వసూళ్లు చేసి పరీక్షల్లో చూసి రాసుకునేందుకు అవకాశం కల్పించాయి. ఈ వ్యవహారంలో ఓపెన్ డిగ్రీ కోఆర్డినేటర్లే దళారులుగా మారి వసూళ్లకు దిగినట్లు ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. ఒక్కో కోఆర్డినేటర్ తమ సెంటర్ విద్యార్థులు పరీక్ష రాసే సెంటర్ కోఆర్డినేటర్ తో ముందే మాట్లాడుకొని ఒక్కొక్కరి నుంచి రూ.4 వేల నుంచి రూ.5 వేల వరకు వసూలు చేసినట్లు సమాచారం. మరికొన్ని కేంద్రాలైతే మరో అడుగు ముందుకేసి ఒకరికి బదులు మరొకరితో రోజు కూలీ రూ. 300 నుంచి 500 వరకూ ఇచ్చి పరీక్షలు రాయిస్తున్నట్లు ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి.
సెంటర్లలో పరీక్షలు జరుగుతున్న వైఖరి బంతి భోజనాల తీరును తలపిస్తున్నాయి అని విమర్శలు వస్తున్నాయి. పట్టణానికి దూరంగా మాస్ కాపీయింగ్ కి అనుకూలంగా ఉండేటట్లు పరీక్ష సెంటర్లు ఏర్పాటు చేసుకున్నారని ప్రజలు వాపోతున్నారు. యూనివర్సిటీ నుంచి వచ్చిన పరీక్షా అబ్జర్వర్లు కూడా చూసి చూడనట్లుగా వ్యవహరిస్తున్నారని ఆరోపణలు వస్తున్నాయి. దీనివల్ల మంచి ప్రతిభగల విద్యార్థుల భవిష్యత్తు ( మెరిట్ స్టూడెంట్స్) అంధకారంలో పడే ప్రమాదం ఉందని విద్యార్థుల తల్లిదండ్రులు ఆందోళన చెందుతున్నారు. ఇలాంటి వాటిపై యూనివర్సిటీ అధికారులు దృష్టి సారించాల్సిన అవసరం ఎంతైనా ఉంది.
సానె గిరిబాబు రాయల్
పీపుల్స్ మోటివేషన్ డెస్క్...✍️