45.5లక్షలతో అభివృద్ధి పనులు ప్రారంభించిన ఎమ్మెల్యే
నంద్యాల టౌన్, ఫిబ్రవరి 03 (పీపుల్స్ మోటివేషన్):-
నంద్యాల పట్టణం 23వ వార్డులో 45.5లక్షల వ్యయంతో అభివృద్ధి పనులను మున్సిపల్ చైర్పర్సన్, కౌన్సిలర్ రాజ్యలక్షి, ఇంచార్జి పార్థసారధితో కలిసి ఎమ్మెల్యే శిల్పారవిరెడ్డి ప్రారంభించారు. గడపగడపకు మన ప్రభుత్వం కార్యక్రమంలో భాగంగా విడుదల చేసిన 20లక్షలు మరియు మున్సిపల్ సాధారణ నిధుల నుండి 25.5లక్షలతో వార్డులో సీసీ డ్రైన్లు, సీసీ రోడ్లు, కల్వర్ట్లు, పైప్ లైన్ ప్రారంభించడం జరిగింది. కార్యక్రమంలో మున్సిపల్ కమిషనర్ నిరంజన్రెడ్డి, మున్సిపల్ ఇంజనీర్లు పాల్గొన్నారు.
ఈ సందర్భంగా మున్సిపల్ చైర్పర్సన్ మాట్లాడుతూ.... నంద్యాల పట్టణంలో అభివృద్ధి పనులు శరవేగంగా చేపడుతున్నామని, అన్ని వార్డులలో ఆయా వార్డుల ప్రాధాన్యతను బట్టి దశలవారిగా పనులు చేస్తున్నామన్నారు. గడపగడపకు మన ప్రభుత్వం కార్యక్రమంలో భాగంగా వార్డులో ప్రజలకు అవసరమైన పనులను గుర్తించి వాటిని పరిష్కరించడం జరిగిందన్నారు. భవిషత్తులో మరింత అభివృద్ధి కార్యక్రమాలను చేపడతామని తెలిపారు. ప్రత్యేకంగా వార్డు ప్రజల తరుపున ఎమ్మెల్యేకు ధన్యవాదాలు తెలిపారు. రానున్న ఎన్నికల్లో ప్రజలకు మంచి చేసిన వైఎస్సార్సీపీని గెలిపించాలని, ఎమ్మెల్యే శిల్పారవిచంద్రకిషోర్రెడ్డికి అండగా నిలిచి ఆశీర్వదించాలని కోరారు. ఈ కార్యక్రమంలో ఏపీఎస్పీడీసీఎల్ డైరెక్టర్ శశికళ రెడ్డి, రాష్ట్ర దృశకులల డైరెక్టర్ సునీత అమృతరాజ్, వార్డు వైసిపి నాయకులు పుల్లయ్య, మహేశ్వరి, ఉశెనమ్మ, టైలర్ శీను ,శిల్పా రమణ, తిక్కన్న, చిన్న నరసింహులు, శివకుమార్క, కల్లె శేఖర్, మద్దిలేటి గౌడ్, కళ్యాణ్ వైసిపి నాయకులు పాల్గొన్నారు