25వ తేదీన గ్రూప్ 2 పరీక్షలను పకడ్బందీగా నిర్వహించాలి
25వ తేదీన గ్రూప్ 2 పరీక్షలను పకడ్బందీగా నిర్వహించాలి
విశాఖ పట్నం తర్వాత కర్నూలు జిల్లాలోనే అధికంగా గ్రూప్ 2 పరీక్షలను రాస్తున్నారు
పరీక్ష కేంద్రాల దగ్గర జిరాక్స్ సెంటర్స్ తెరవకూడదు
పరీక్షా కేంద్రాల దగ్గర 144 సెక్షన్ అమలు చేయాలి
పరీక్ష కేంద్రాల్లో సీసీ కెమెరాలను ఏర్పాటు
-జాయింట్ కలెక్టర్ నారపురెడ్డి మౌర్య
కర్నూలు, ఫిబ్రవరి 23 (పీపుల్స్ మోటివేషన్):-
శుక్రవారం స్థానిక సిల్వర్ జూబ్లీ కళాశాల ఆడిటోరియంలో గ్రూప్ 2 పరీక్షల నిర్వహణ పై సంబంధిత అధికారులతో సమన్వయ సమీక్షా సమావేశాన్ని జాయింట్ కలెక్టర్ నారపురెడ్డి మౌర్య నిర్వహించారు.
ఈ సందర్భంగా జాయింట్ కలెక్టర్ నారపురెడ్డి మౌర్య మాట్లాడుతూ...జిల్లా లో ఈనెల 25 వ తేదీన నిర్వహించే గ్రూప్ 2 పరీక్షలు ఎలాంటి పొరపాట్ల కు తావులేకుండా పకడ్బందీగా నిర్వహించేలా చర్యలు తీసుకోవాలని సంబంధిత అధికారులను ఆదేశించారు. మొట్ట మొదటి సారి గ్రూప్ 2 పరీక్షల నిర్వహణకు ఐఏఎస్ అధికారిని కోఆర్డినేటింగ్ అధికారి గా ప్రభుత్వం నియమించిందన్నారు.. అందులో భాగంగా జాయింట్ కలెక్టర్ కోఆర్డినేటింగ్ అధికారి గా వ్యవహరించడం జరుగుతోందన్నారు.. అన్ని శాఖలు సమన్వయంతో పనిచేసి, పారదర్శకతతో విజయవంతంగా పరీక్షలను నిర్వహించాలన్నారు..
ఉదయం 10 గంటల 15 నిమిషాలకు పరీక్ష కేంద్రంలో ఉండాలి....
ఈ నెల 25 వ తేదీన ఉదయం 10:30 నుండి ఒంటి గంట వరకు OMR ఆధారంగా స్క్రీనింగ్ టెస్ట్ (ఆబ్జెక్టివ్ టైప్) ఆంధ్ర ప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ ఆధ్వర్యంలో నిర్వహించడం జరుగుతుందన్నారు. జిల్లాలో కర్నూలు నగరం, కోడుమూరు,ఎమ్మిగనూరు, ఆదోని లోని 126 సెంటర్లలో 36 వేల మంది గ్రూప్ 2 పరీక్షలు రాస్తున్నారన్నారు. విశాఖ పట్నం తర్వాత కర్నూలు జిల్లాలోనే అధికంగా ఈ పరీక్షలు రాస్తున్నారన్నారు..2,3 సెంటర్లకు కలిపి 34 రూట్లు గా విభజించి 34 మంది జిల్లా అధికారులను రూట్ ఆఫీసర్లుగా నియమించడం జరిగిందన్నారు. ప్రశ్న పత్రాలను ట్రెజరీలో డిపాజిట్ చేయడం జరుగుతుందన్నారు . ప్రశ్న పత్రాలను, ఓఎంఆర్ సీట్ల ను, రూట్ ఆఫీసర్స్ ఉదయం 5 గంటలకు ట్రెజరీ నుండి తీసుకొని కోడ్ నంబర్ల ప్రకారం ఏ సెంటర్ కు సంబంధించిన omr షీట్ లను,ప్రశ్న పత్రాల ను ఆ సెంటర్లకు పోలీస్ సెక్యూరిటీతో తీసుకొని వెళ్లి పరీక్ష కేంద్రంలోని చీఫ్ సూపరింటెండెంట్ లకు అందచేయాలన్నారు.. అలాగే 126 మంది మండల స్థాయి అధికారులను లైజనింగ్ ఆఫీసర్స్ గా నియమించడం జరిగిందన్నారు. లైజనింగ్ ఆఫీసర్స్ పరీక్ష కేంద్రాల్లో పర్యవేక్షణ చేయాలన్నారు.చీఫ్ సూపరింటెండెంట్లు పరీక్షలకు ఒక్కరోజు ముందుగానే సీటింగ్ అరేంజ్మెంట్ చేయాలన్నారు.. ప్రశ్నపత్రాలు సరిగా ఉన్నాయాలేదా అని చూసుకోవడం, ప్రశ్నపత్రాలు ప్యాకింగ్ చేసేటప్పుడు జాగ్రత్తగా ప్యాకింగ్ చేయడం ఇలాంటి విధులను సక్రమంగా నిర్వహించాలన్నారు. పోలీస్ డిపార్ట్మెంట్ నిర్ణీత సమయం లో వచ్చి రూట్ ఆఫీసర్ల వెంట సెక్యూరిటీగా వెళ్లాలన్నారు. పరీక్ష కేంద్రాల దగ్గర జిరాక్స్ సెంటర్స్ తెరవకుండా చూడాలన్నారు. 144 సెక్షన్ అమలు చేయాలన్నారు. పరీక్ష కేంద్రాలకు విద్యార్థులు వెళ్లడానికి ఇబ్బంది లేకుండా అవసరం ఉన్నచోట ప్రత్యేక బస్సు లు నడపాలన్నారు. విద్యుత్ అంతరాయం లేకుండా విద్యుత్ శాఖ తగిన చర్యలు తీసుకోవాలన్నారు . విద్యుత్తు శాఖ అధికారుల మొబైల్ నంబర్లను అధికారులకు అందచేయాలని సూచించారు.. పరీక్ష కేంద్రాలకు వచ్చే విద్యార్థులకు అవసరమైన మందులు, ఫస్ట్ ఎయిడ్, ఒక ఏఎన్ఎం కూడా ఉండేలా వైద్య ఆరోగ్య శాఖ చర్యలు తీసుకోవాలన్నారు. పరీక్షకు హాజరయ్యే గర్భిణీ స్త్రీలకు, దివ్యాంగులకు కింద ఫ్లోర్ లోనే పరీక్ష రాసే విధంగా తగిన సౌకర్యాలు కల్పించాలన్నారు.scribe ను ఏర్పాటు చేసుకునే సౌకర్యం ఉందన్నారు.. పరీక్షలు రాసే విద్యార్థులు ఉదయం 10 గంటల 15 నిమిషాలకు పరీక్ష కేంద్రంలో ఉండాలన్నారు. స్మార్ట్ వాచెస్, మొబైల్ లాంటి ఎలక్ట్రానిక్ పరికరాలను పరీక్ష హాల్లోకి అనుమతించడం జరగదని జాయింట్ కలెక్టర్ స్పష్టం చేశారు.
APPSC కమిషన్ డిప్యూటీ సెక్రటరీ సి కొండారెడ్డి, అసిస్టెంట్ సెక్రటరీ కె శ్రీనివాసరావు లు మాట్లాడుతూ...గ్రూప్ 2 పరీక్షలు నిరుద్యోగ యువత భవిష్యత్తుకు సంబంధించినందున పరీక్షలను సమర్థవంతంగా నిర్వహించి నిరుద్యోగ యువతకు తోడ్పడాలన్నారు. పరీక్ష కేంద్రాల్లో సీసీ కెమెరాలను ఏర్పాటు చేయడం జరుగుతోందని, ఈ కెమెరాల ద్వారా ఏపీపీఎస్సీ కార్యాలయం కమాండ్ కంట్రోల్ రూమ్ నుండి అధికారులు కూడా పర్యవేక్షిస్తారన్నారు.. హాజరైన రూట్ ఆఫీసర్లు, లైజనింగ్ ఆఫీసర్స్, చీఫ్ సూపరింటెండెంట్ లు పరీక్షల నిర్వహణలో తీసుకోవలసిన మెలకువలు, జాగ్రత్తలను గురించి వివరించారు.
అడిషనల్ ఎస్పీ నాగరాజు మాట్లాడుతూ...కేంద్రాల వద్ద 378 మంది, రూట్ లలో 68 మంది పోలీసులతో బందో బస్త్ ఏర్పాటు చేస్తున్నామన్నారు. ఈ సమావేశంలో డిఆర్ఓ కె మధుసూదన్ రావు, ఏపీపీఎస్సి సెక్షన్ ఆఫీసర్ డిల్లేశ్వరరావు,రూట్ ఆఫీసర్స్, లైజనింగ్ ఆఫీసర్, చీఫ్ సూపరింటెన్డెంట్లు, తదితరులు పాల్గొన్నారు.