రాజ్యసభ ఎన్నికలకు ఏడు రాష్ట్రాల్లో 14 మందిని ఎంపిక చేసిన బిజెపి
రాజ్యసభ ఎన్నికలకు ఏడు రాష్ట్రాల్లో 14 మందిని ఎంపిక చేసిన బిజెపి
దిల్లీ, (పీపుల్స్ మోటివేషన్):-
ఎగువ సభకు నామినేషన్లకు గడువు దగ్గర పడుతుండడంతో రాజకీయ పార్టీలు తమ అభ్యర్థులను వేగంగా ఖరారు చేస్తున్నాయి. పశ్చిమ బెంగాల్లో తృణమూల్ కాంగ్రెస్ ఐదు స్థానాలకు నలుగురి పేర్లను ఖరారు చేయగా.. తాజాగా భాజపా ఏడు రాష్ట్రాల్లో 14 మంది పేర్లను ఎంపిక చేసింది. వాటిలో అత్యధికంగా ఉత్తరప్రదేశ్ నుంచి ఏడుగురు, బిహార్ నుంచి ఇద్దరు, ఛత్తీస్ఘడ్ ఒకరు, హరియాణా ఒకరు, కర్ణాటక ఒకరు, ఉత్తరాఖండ్ ఒకరు, పశ్చిమబెంగాల్ నుంచి ఒకరి చొప్పున అభ్యర్థుల పేర్లు ఖరారు చేసింది.
రాష్ట్రాల వారిగా జాబితా....
👉ఉత్తరప్రదేశ్ నుంచి...
ఆర్పీఎన్ సింగ్, డా. సుధాన్షు త్రివేది, చౌదరి తేజ్వీర్ సింగ్, సాధనా సింగ్, అమర్పాల్ మౌర్య, సంగీత బల్వంత్, నవీన్ జైన్
👉బిహార్ నుంచి... డా. ధర్మశీల గుప్తా, భీమ్ సింగ్
👉ఛత్తీస్గఢ్ నుంచి... రాజా దేవేంద్ర ప్రతాప్ సింగ్
👉 హరియాణా నుంచి... సుభాష్ బరాలా
👉 కర్ణాటక నుంచి... నారాయణ కష్ణస భండగే
👉ఉత్తరాఖండ్ నుంచి... మహేంద్ర భట్
👉పశ్చిమబెంగాల్ నుంచి... సమిక్ భట్టాచార్య
15 రాష్ట్రాల నుంచి ఏప్రిల్లో ఖాళీ అయ్యే 56 రాజ్యసభ స్థానాలకు కేంద్ర ఎన్నికల సంఘం జనవరిలో నోటిఫికేషన్ విడుదల చేసిన విషయం తెలిసిందే. ఫిబ్రవరి 8 నుంచి రాజ్యసభ ఎన్నిలకు దరఖాస్తులు స్వీకరణ మొదలవ్వగా.. ఫిబ్రవరి 15 తో ముగియనుంది. ఫిబ్రవరి 27న పోలింగ్ నిర్వహించి అదేరోజు సాయంత్రం 5గంటలకు ఓట్ల లెక్కింపు చేపట్టి ఫలితాలను ప్రకటిస్తారు. అత్యధికంగా ఉత్తరప్రదేశ్లో 10 స్థానాలకు పోలింగ్ జరగనుండగా.. బిహార్ 6, మహారాష్ట్రలో 6, పశ్చిమబెంగాల్లో 5, మధ్యప్రదేశ్ 5, గుజరాత్ 4, కర్ణాటకలో 4, ఒడిశా, రాజస్థాన్, తెలంగాణ, ఆంధ్రప్రదేశ్లో మూడేసి చొప్పున స్థానాలకు; హరియాణా, ఛత్తీస్ గఢ్, హిమాచల్ ప్రదేశ్, ఉత్తరాఖండ్లో ఒక్కో రాజ్యసభ స్థానానికి పోలింగ్ జరగనుంది.