రెండు తెలుగు రాష్ట్రాలలో పీపుల్స్ మోటివేషన్ తెలుగు దినపత్రికలో పనిచేయుటకు మండలాల వారీగా రిపోర్టర్లు, నియోజకవర్గ ఇంచార్జీలు, జిల్లా స్టాపర్లు కావలెను...✍️సంప్రదించండి: 80086 22746

-Advertisement-

గ్రూప్-1 ప్రిలిమినరీ పరీక్ష జూన్ 9వ తేదీన...

Appsc Group 1 posts ?TSPSC group 1 posts?Group 1 exam dates?Who are eligible for Group 1 exam?What is the qualification Group 1?Group1 hall tickets?
Peoples Motivation

తెలంగాణ రాష్ట్రంలో 563 ఉద్యోగాల గ్రూపు-1 సర్వీసెస్ TSPSC జూన్ 9న ప్రిలిమినరీ పరీక్ష నిర్వహించనున్నట్లు టిఎస్పిఎస్సి ప్రకటించింది.

563 గ్రూప్- 1 ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ 2024 (Group 1 Notification 2024) విడుదల చేసింది. గత ప్రభుత్వం 2022లో ఇచ్చిన నోటిఫికేషన్ ను రద్దు చేసిన గంటల వ్యవధిలోనే తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్(TSPSC) కొత్త నోటిఫికేషన్ ను ఇటీవలే విడుదల చేసింది. 

Thumbnails news

ముఖ్యమైన తేదీలు:

ఫిబ్రవరి 23 నుంచి మార్చి 14వ తేదీ సాయంత్రం 5గంటల వరకు అభ్యర్థుల నుంచి ఆన్లైన్లో దరఖాస్తులు స్వీకరించనున్నారు. 

జూన్ 9వ తేదీన  ప్రిలిమినరీ పరీక్ష. సెప్టెంబర్/అక్టోబర్లో మెయిన్ పరీక్ష నిర్వహించనున్నారు. దరఖాస్తుల్లో పొరపాట్లు ఉంటే మార్చి 23 ఉదయం 10గంటల నుంచి 27 సాయంత్రం 5గంటల వరకు సరిచేసుకోవచ్చు.

పరీక్ష తేదీకి ఏడు రోజుల ముందు నుంచి హాల్ టిక్కెట్లు అందుబాటులోకి తెస్తారు.

గతంలో దరఖాస్తు చేసినా ఈ నోటిఫికేషన్లో పోస్టులకు మళ్లీ చేసుకోవాల్సిందేనని టీఎస్పీఎస్సీ స్పష్టం చేసింది. గత నోటిఫికేషన్లో దరఖాస్తు చేసుకున్న వారికి ఫీజు నుంచి మినహాయింపు కల్పిస్తామని తెలిపింది. జోన్లవారీగా పోస్టుల వివరాలు, పరీక్ష సిలబస్ తదితర పూర్తి వివరాలు ఈ కింది వెబ్సైట్లో చూడొచ్చు.

పోస్టులు, వయో పరిమితి (జులై 1, 2024 నాటికి), పే స్కేలు వివరాలివే...ఇలా ఉన్నాయి.

డిప్యూటీ కలెక్టర్లు (45 పోస్టులు):

వయసు 18 నుంచి 46 ఏళ్లు, వేతనం రూ.58,850 రూ.1,37,050

డీఎస్సీ(115 పోస్టులు):

 వయసు 21 నుంచి 35 ఏళ్లు, వేతనం రూ. 58,850 - రూ. 1,37,050

 సిటీవో (48 పోస్టులు):

వయసు 18 నుంచి 46 ఏళ్లు, వేతనం రూ. 58, 850 - 1,37,050

ఆర్టీవో (4 పోస్టులు):

వయసు 21 నుంచి 46 ఏళ్లు, వేతనం రూ. 54. 220 -5.1.33,630


జిల్లా పంచాయతీ అధికారి (7 పోస్టులు):

వయసు 18 నుంచి 46 ఏళ్లు, వేతనం రూ.54,220 -రూ.1,33,630


జిల్లా రిజిస్ట్రార్ (6 పోస్టులు):

వయసు 18 నుంచి 46 ఏళ్లు, వేతనం రూ.54,220 -రూ.1,33,630


జైళ్ల శాఖలో డీఎస్పీ (5 పోస్టులు):

వయసు 18 నుంచి 35 ఏళ్లు, వేతనం రూ.54.220-రూ.1,33,630


సహాయ కార్మిక అధికారి (8 పోస్టులు): 

వయసు 18 నుంచి 46 ఏళ్లు, వేతనం రూ.54, 220 -రూ.1,33,630


అసిస్టెంట్ ఎక్సైజ్ సూపరింటెండెంట్ (30 పోస్టులు): 

వయసు 21 నుంచి 35 ఏళ్లు, వేతనం రూ.51,320 -రూ.1,27,310


గ్రేడ్ -2 మున్సిపల్ కమిషనర్ (41 పోస్టులు): 

వయసు 18 నుంచి 46 ఏళ్లు, వేతనం రూ.51,320-రూ.1,27,310


సాంఘిక సంక్షేమ శాఖ సహాయ సంచాలకులు/జిల్లా అధికారులు (3 పోస్టులు): 

వయసు 18 నుంచి 46 ఏళ్లు, వేతనం 54,220 - 1,33,630


జిల్లా బీసీ అభివృద్ధి అధికారి (5 పోస్టులు): 

వయసు 18 నుంచి 46 ఏళ్లు, వేతనం రూ.54,220 - రూ.1,33,630


జిల్లా గిరిజన సంక్షేమ అధికారి (2 పోస్టులు):

వయసు 18 నుంచి 46 ఏళ్లు, వేతనం రూ.54,220-రూ.1,33,630


జిల్లా ఉపాధి కల్పన అధికారి (5 పోస్టులు): 

వయసు 18 నుంచి 46 ఏళ్లు, వేతనం రూ.51,320 -రూ.1,27,310


ప్రజారోగ్య, కుటుంబ సంక్షేమ అడ్మినిస్ట్రేటివ్ ఆఫీసర్ (20 పోస్టులు): 

వయసు 18 నుంచి 46 ఏళ్లు, వేతనం రూ.51,320- 1.27,310


అసిస్టెంట్ ట్రెజరీ ఆఫీసర్ (38 పోస్టులు):

వయసు 18 నుంచి 46 ఏళ్లు, వేతనం రూ.51,320 -రూ.1,27,310


అసిస్టెంట్ ఆడిట్ ఆఫీసర్ (41 పోస్టులు):

వయసు 18 నుంచి 46 ఏళ్లు, వేతనం రూ.51,320 -రూ.1,27,310

ఎంపీడీవో (140 పోస్టులు):

వయసు 18 నుంచి 46 ఏళ్లు, వేతనం రూ.51,320- రూ.1,27,310

మరిన్ని వివరాలకు ఈ కింది వెబ్సైట్ ను సందర్శించగలరు.

https://www.tspsc.gov.in/

Comments

-Advertisement-